HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Superstar Krishna Garu Remembers Ba Raju Garu On His First Vardhanthi

Superstar Krishna: బి ఏ రాజు నా అభిమాని!

1600 చిత్రాలకు పైగా పి ఆర్ ఓ గా పనిచేసిన స్టార్ పి ఆర్ ఓ, సూపర్ హిట్ పత్రిక, ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ అధినేత, పాపులర్ జర్నలిస్ట్ బీఏ రాజు

  • Author : Balu J Date : 21-05-2022 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishna
Krishna

1600 చిత్రాలకు పైగా పి ఆర్ ఓ గా పనిచేసిన స్టార్ పి ఆర్ ఓ, సూపర్ హిట్ పత్రిక, ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ అధినేత, పాపులర్ జర్నలిస్ట్, ఆర్ జె సినిమాస్, సూపర్ హిట్ ఫ్రెండ్స్ బ్యానర్లపై సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సక్సెస్ ఫుల్ నిర్మాత బి ఏ రాజు మనందరినీ విడిచి భౌతికంగా దూరమయ్యి సంవత్సరం గడిచినా… ఆయన చిరునవ్వు, స్నేహశీలత, తెలుగు సినీ పరిశ్రమ లో, పాత్రికేయ రంగం మీద ఆయన వేసిన చెరగని ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిగా పరిశ్రమ లోకి అడుగుపెట్టిన బి ఏ రాజు గారు అంచలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమ లో ఆయన తెలియని వారు లేనంతగా అనుబంధాన్ని పెంచుకున్నారు. తన ప్రియ అభిమాని బి ఏ రాజు గురించి కృష్ణ గారు తన జ్ఞాపకాలు పంచుకున్నారు…

“బి ఏ రాజు నా అభిమాని. నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా నన్ను కలిసేవాడు. ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు. నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి, ఏదన్నా పేపర్ కు రెకమండ్ చేయండి అని అంటే నేనే జ్యోతిచిత్ర కు సిఫారసు చేశాను. తర్వాత రకరకాల పేపర్ లలో పని చేశాడు. ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి, ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ 1 పత్రికగా తీర్చిదిద్దాడు. సూపర్ హిట్ పత్రిక ఎంత ఫేమస్ అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు, చికాగో లో ఇండియన్ స్ట్రీట్ లో అన్నీ ఇండియన్ షాపులు ఉండేవి. అందులో పేపర్లు అమ్మే తెలుగు షాపు ఒకటి ఉంది. అందులో ఆదివారం ఎడిషన్ ఈనాడు, సూపర్ హిట్ ఈ రెండే తెలుగు పేపర్లు ఉన్నాయి. అమెరికా లో కూడా పాపులర్ అయ్యేంతగా డెవలప్ చేశాడు సూపర్ హిట్ ని. తర్వాత నిర్మాతగా సినిమాలు కూడా తీశాడు. చాలా అభివృద్ధి లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంత త్వరగా మనందరినీ విడిచి అతను వెళ్లిపోవడం చాలా బాధాకరం.” అన్నారు కృష్ణ గారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BA Raju
  • krishna
  • super star
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd