MaheshBabu: హర్ ఘర్ తిరంగా పేరిట హోరెత్తుతున్న ప్రచారం…గర్వంగా భావిద్దామంటూ మహేశ్ బాబు పిలుపు..!
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
- By Bhoomi Updated On - 05:38 PM, Mon - 1 August 22

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ వేడుకలు ఈనెల 13 నుంచి 15వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఆవిష్కరించాలంటూ కేంద్రం పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారం హోరెత్తుతోంది.
ఈ ప్రచారంలో భాగంగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కూడా పాలుపంచుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ట్విట్ చేశారు. త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేద్దామంటూ అందరూ ప్రతిజ్ఞ చేద్దామంటూ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ కు జత చేశారు మహేశ్ బాబు.
Our Tiranga.. our pride! Let's pledge to keep our tricolour flying high! #HarGharTiranga from 13th-15th August 2022! https://t.co/jRL48t8iaw pic.twitter.com/5lOlITxqIr
— Mahesh Babu (@urstrulyMahesh) August 1, 2022
Related News

Errabelli Pradeep Rao : గులాబీకి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గుడ్ బై…కమలానికి జై…?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అంతకంతకూ మారుతున్నాయి. ఈ మధ్యే కోమట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి....బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన బాటలోనే మరికొంతమంది లీడర్లు నడుస్తున్నారు.