Khammam : ఖమ్మంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్.. అధికార పార్టీ నేత వేధింపులే..?
ఖమ్మంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆర్ సమత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఖమ్మం నగరంలోని దేవాదాయ
- By Prasad Published Date - 06:32 PM, Tue - 7 February 23

ఖమ్మంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆర్ సమత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఖమ్మం నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో అధికారి కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖమ్మం రూరల్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు తనను అవమానించాడని అధికారిణి ఆరోపిస్తున్నారు. వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె తెలిపారు. మారెమ్మ ఆలయ కమిటీపై ఆమెకు బెల్లం వేణుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అయితే అధికారిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.