Mopidevi: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ!
ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని మోపిదేవిలో స్వయంభుగా వెలసిన శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
- By Balu J Published Date - 06:40 PM, Wed - 2 February 22

ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని మోపిదేవిలో స్వయంభుగా వెలసిన శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ లీలా కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా 5వ తేదీన స్వామివారి పెళ్లికుమారుడి ఉత్సవం, 6న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 8వ తేదీన వసంతోత్సవం, ముగింపులో భాగంగా 9వ తేదీన సుబ్రహ్మణ్య హవనం, రాత్రికి ద్వాదశ ప్రదక్షణలు, తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు. కొవిడ్ నిబంధనల కారణంగా స్వామివారి ఊరేగింపును తాత్కాలికంగా రద్దు చేసినట్లు సహాయ కమిషనర్ పేర్కొన్నారు.