Crime: వీఎన్ఆర్ కళాశాల విద్యార్ధి ఆత్మహత్య
- Author : hashtagu
Date : 23-12-2021 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అలర్ట్ అయిన కాలేజ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్ధితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.