Mega DSC : మెగా DSC పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – విద్యాశాఖ
Mega DSC : మెగా DSC పరీక్షల నిర్వహణకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ వ్యవస్థను ఉపయోగించామని వెల్లడించింది
- By Sudheer Published Date - 08:23 PM, Fri - 11 July 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా DSC పరీక్షల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు సూచించింది. పరీక్షా ప్రక్రియను పారదర్శకంగా, అత్యంత సాంకేతిక భద్రతతో నిర్వహించామని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా లేదా ఇతర మార్గాల్లో వదంతులు వ్యాపింపజేస్తే, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి మాటలు మనిషి కాదు చేతల మనిషి – రేణుకా చౌదరి
విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో.. మెగా DSC పరీక్షల నిర్వహణకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ వ్యవస్థను ఉపయోగించామని వెల్లడించింది. ఈ చర్యతో ప్రశ్నపత్రాల లీక్, టాంపరింగ్ వంటి అనుమానాలకు తావే లేదని పేర్కొంది. అలాగే పరీక్షలన్నీ రియల్ టైమ్ సర్వర్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షించామని, దీనివల్ల ఎటువంటి అక్రమాలకు అవకాశమే లేదని పేర్కొంది. ప్రశ్నపత్రాల తయారీ, డిజిటల్ డెలివరీ ప్రతి దశ కూడా ఖచ్చితమైన నిబంధనల ప్రకారమే జరిగినదని, అభ్యర్థులు ఎలాంటి అపోహలకూ లోనవ్వకూడదని స్పష్టం చేసింది. మెగా DSC వంటి కీలక నియామక పరీక్షల విషయంలో వదంతులు వ్యాపించకుండా అన్ని దశలూ తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది.