SSC exams: నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుంకు సంబంధిత అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
- By Balu J Updated On - 02:24 PM, Tue - 17 May 22

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుంకు సంబంధిత అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలోని మొత్తం 2,861 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మే 23 నుంచి జూన్ 1 మధ్య నిర్వహించే ఎస్‌ఎస్‌సీ పరీక్షల నిర్వహణపై సీనియర్ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, పరీక్షలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. తక్షణమే స్పందించే కేంద్రీకృత కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణలో మొత్తం 5, 09, 275 మంది విద్యార్థులు SSC పరీక్షలకు హాజరుకానున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అత్యవసర వైద్య సదుపాయాలు, సరైన తాగునీటి సదుపాయం, ఆర్టీసీ బస్సు రవాణా సేవలను అందించేందుకు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను నియమించినట్లు మంత్రి తెలిపారు.
Related News

Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.