HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sri Lanka 50 All Out In Asia Cup 2023 Final Match

IND vs SL: శ్రీలంక (50) ఆలౌట్.. పగ తీర్చుకున్న టీమిండియా

ఆసియా క‌ప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక తేలిపోయింది. మొదట బ్యాటింగ్ బరిలో దిగిన శ్రీలంకను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ లో 7 వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను అణికించేశాడు.

  • Author : Praveen Aluthuru Date : 17-09-2023 - 6:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India In World Cup
IND vs SL

IND vs SL: ఆసియా క‌ప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక తేలిపోయింది. మొదట బ్యాటింగ్ బరిలో దిగిన శ్రీలంకను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను వణికించేశాడు. మొదటి వికెట్ తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా బోణి కొడితే ఆ తర్వాత సిరాజ్ బంతితో విశ్వరూపం చూపించాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ లో సిరాజ్ మొదటి బంతికి నిస్సంకని అవుట్ చేసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. వరుసగా సమరవిక్రమ, అసలంక, ధనుంజయ వికెట్స్ అదే ఓవర్ లో తీసి లంక నడ్డి విరిచాడు. ఇక తన మూడో ఓవర్ లో కెప్టెన్ శనకాని డకౌట్ చేశాడు. ఆ వెంటనే కుశల్ మెండీస్ ని పెవిలియన్ చేర్చాడు. దీంతో మహ్మద్ సిరాజ్ తొలిసారి 6 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.సిరాజ్ ధాటికి శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక జట్టులో ఒక ప్లేయర్ కూడా టీమిండియా బౌలింగ్ దళం ముందు నిలువలేకపోయారు. విశేషమేంటంటే కుశల్ మెండీస్ సాధించిన 17 పరుగులే అత్యధికం. గతంలో 2000 సంవత్సరంలో ఇండియా ఇదే శ్రీలంక చేతిలో 54 పరుగులకే ఆలౌట్ అయింది. 23 ఏళ్ళ తరువాత శ్రీలంకని అంతకన్నా తక్కువ పరుగులకే ఆలౌట్ చేసి పగ తీర్చుకుంది.

Also Read: IND vs SL: చ‌రిత్ర సృష్టించిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 50 All Out
  • Asia Cup 2023 Final
  • Ind vs SL
  • india
  • Mohammed Siraj
  • Sri Lanka

Related News

    Latest News

    • Gold Price Down Today : బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

    • Airport : తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రమంత్రి రామ్మోహన్ గ్రీన్ సిగ్నల్

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd