AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
- Author : hashtagu
Date : 18-03-2022 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలికాస్ట్ కాకుండా ఆందోళన జరిగే కార్యక్రమాల విడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పీకర్ శాసనసభ్యులందరూ సభకు సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా స్పీకర్ నిషేధించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ టి సీతారాం సభ్యులు సభలోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు, ప్రతిపక్ష టిడిపి శాసనసభ్యులు కార్యక్రమాలను రికార్డ్ చేసి మీడియాకు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారని పీటీఐ తెలిపింది.