Cameras School Buses: తెలంగాణ స్కూల్స్ బస్సుల్లో సీసీ కెమెరాలు మస్ట్
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పాఠశాల విద్యా శాఖ త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాల బస్సులలో, ముఖ్యంగా ప్రైవేట్
- Author : Balu J
Date : 03-11-2022 - 2:38 IST
Published By : Hashtagu Telugu Desk
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పాఠశాల విద్యా శాఖ త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాల బస్సులలో, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించే బస్సులలో CCTV కెమెరాలను తప్పనిసరి చేస్తుంది. పాఠశాల యాజమాన్యాలు బస్సు ముందు, వెనుక భాగంలో తప్పనిసరిగా CCTV కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్‌లను ఏర్పాటు చేయాలి. పాఠశాల బస్సుల్లో సీసీటీవీలతో పాటు జీపీఎస్‌ను కూడా తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఈ సిస్టమ్ వల్ల ఇటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల అధికారులకు ఉపయోగపడనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.