Sonia Gandhi Tests: సోనియాగాంధీకి కరోనా పాజిటివ్!
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో వెయ్యిలోపు కేసులు నమోదు కాగా, వైరస్ వ్యాప్తితో ఆ సంఖ్య మూడు వేలకుపైగా చేరాయి.
- By Balu J Published Date - 01:05 PM, Thu - 2 June 22

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో వెయ్యిలోపు కేసులు నమోదు కాగా, వైరస్ వ్యాప్తితో ఆ సంఖ్య మూడు వేలకుపైగా చేరాయి. దీంతో సామాన్యులు, ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం తెలిపారు. “ఆమె తేలికపాటి జ్వరం, కొన్ని లక్షణాలను బాధపడుతోంది’’ అని చెప్పారు. అయితే డాక్టర్లు సోనియాను పరీక్షించి హోమ్ ఐసోలేట్ కావాలని సూచించడంతో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే చికిత్స పొందుతోంది. సోనియా గాంధీకి కరోనా సోకడంతో ఆమె అభిమానులు, పార్టీ శ్రేణులు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
కాంగ్రెస్ పార్టీలో కరోనా కలకలం రేగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు కరోనా సోకినట్లు సమాచారం. కాగా.. గతవారమే పార్టీ ముఖ్యనేతలతో సోనియా గాంధీ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో నిన్న సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 8న ఈడీ ముందు సోనియా విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Congress President Smt. Sonia Gandhi ji tests Covid positive
We all wish & prayer for her a speedy recovery.@INCTelangana https://t.co/zRCVTCzx2C
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 2, 2022