Road Accident: రోడ్డ ప్రమాదంలో సోషల్ మీడియా కన్వీనర్ మృతి
- By Balu J Published Date - 10:11 AM, Sat - 2 March 24
Road Accident: ఏపీలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాాగా అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బోయపల్లి వద్ద రాయచోటి-గాలివీడు రహదారి పై ట్రాక్టర్ ను బైక్ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వైయస్సార్సీపి సోషల్ మీడియా అన్నమయ్య జిల్లా కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా అతని స్నేహితుడు గజపతి గాయపడ్డాడు. భరత్ కుమార్ రెడ్డి రామాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి తన స్నేహితుడు తో కలిసి బైక్ పై తన స్వగ్రామమైన గాలివీడుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది.
భరత్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆస్పత్రి కి చేరుకొని భరత్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.