Women Reservation Bill: పీవీ నరసింహారావు మృతదేహాన్ని పార్టీ ఆఫీసులోకి అనుమతించలేదు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ, స్మృతి ఇరానీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పార్లమెంట్ లో ఈ సీనియర్ లీడర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 05:39 PM, Wed - 20 September 23

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ, స్మృతి ఇరానీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పార్లమెంట్ లో ఈ సీనియర్ లీడర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టామని కాంగ్రెస్ వాదిస్తుంది.
కాంగ్రెస్ వాదనపై స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సోనియా గాంధీని విమర్శించారు.పీవీ నరసింహారావు చనిపోతే ఆయన మృతదేహాన్ని సొంత పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు కల్పించే అవకాశముందని, అయితే ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా రిజర్వేషన్లు 15 సంవత్సరాలు వర్తిస్తుందని స్మృతి ఇరానీ అన్నారు. బిజెపి రాజ్యాంగం ప్రకారం నడుస్తుంటే, ప్రతిపక్ష పార్టీ దానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఎదురుదాడి చేశారు. తాజాగా ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా లక్ష్మీదేవి రాజ్యాంగ రూపం దాల్చిందని ఆమె అన్నారు.
Also Read: Mohammad Siraj : వన్డేల్లో మళ్లీ నెంబర్ వన్ గా సిరాజ్