Kapurthala: భారత్ లో అత్యంత చిన్న నగరం ఏదో తెలుసా.. ఆ నగరం ప్రత్యేకతలు ఇవే?
భారతదేశంలో చిన్న నగరాలు, పెద్ద నగరాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. ఇండియాలో
- Author : Anshu
Date : 25-07-2023 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
భారతదేశంలో చిన్న నగరాలు, పెద్ద నగరాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. ఇండియాలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతాయి. వీటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. ఏడాది లక్షల సంఖ్యలో విదేశీయులు, పర్యాటకులు వస్తుంటారు. ఇకపోతే మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉందన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. ఆ నగరంలో జనసంఖ్య 2011లో 98,916 మాత్రమే.
కోవిడ్ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. ఆ చిన్న నగరం పంజాబ్‌లో ఉంది. అదే కపూర్థలా. ఈ అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరరు పొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్ పారిస్ అని కూడా పిలిచేవారు. ఈ నగరాన్ని నవాబ్ కపూర్ స్థాపించడంతో దీనికి కపూర్థలా అనే పేరు వచ్చింది. భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. ఇక్కడి జగత్‌జీత్ ప్యాలెస్ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్‌జీత్ సింగ్‌కు నివాసంగా ఉండేది.

Kapurthala 1
ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో సైనిక స్కూల్ నడుస్తోంది. ఈ మహల్‌ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తకళ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్‌లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్‌సర్ లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా కపూర్థలాకు చేరుకోవచ్చు.