Computer Power Options : కంప్యూటరులో హైబర్నేట్ మోడ్, స్లీప్ మోడ్ మధ్య తేడా తెలుసా ?
Computer Power Options : విండోస్ కంప్యూటర్లలోని పవర్ ఆప్షన్లలో స్లీప్ మోడ్ మంచిదా ? షట్ డౌన్ మోడ్ మంచిదా ?
- Author : Pasha
Date : 27-12-2023 - 11:31 IST
Published By : Hashtagu Telugu Desk
Computer Power Options : విండోస్ కంప్యూటర్లలోని పవర్ ఆప్షన్లలో స్లీప్ మోడ్ మంచిదా ? షట్ డౌన్ మోడ్ మంచిదా ? హైబర్నేట్ మోడ్ మంచిదా ? వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏది అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. వాస్తవానికి ఈ మూడు ఆప్షన్లకు తోడుగా ఫాస్ట్ స్టార్టప్ అనే మరో ఆప్షన్‌ను కూడా మైక్రోసాఫ్ట్ జోడించింది.
We’re now on WhatsApp. Click to Join.
- మనం ‘హైబర్నేట్ మోడ్’ను వాడితే.. కంప్యూటర్ ర్యామ్లోని కంటెంట్‌ను హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్డీలో సేవ్ చేస్తుంది. ఆ తర్వాతే కంప్యూటర్ పవర్ ఆఫ్ అవుతుంది. మనం ఎక్కువ అప్లికేషన్లు ఓపెన్ చేసినప్పుడు, కంప్యూటర్ హైబర్నేట్ కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మనం మళ్లీ కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు.. అంతకుముందు ఉపయోగించిన అప్లికేషన్లు అన్నీ బ్యాకప్ అవుతాయి. ప్రొఫెషనల్స్‌కు, చాలా అప్లికేషన్లు వాడేవారికి హైబర్నేట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
- కంప్యూటర్‌ను లోపవర్ మోడ్‌లో ఉంచే ఆప్షన్ పేరే ‘స్లీప్ మోడ్’. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు కంప్యూటర్‌లోని ర్యామ్‌కు పవర్ సప్లై అవుతుంది. ఫలితంగా మీరు పీసీలో ఉపయోగించిన అన్ని యాప్‌లు, డేటా ప్రాసెస్‌లోనే ఉంటాయి. ఈ దశలో కంప్యూటర్ పవర్ ఆఫ్ చేసినా, ఎటువంటి డేటాను కోల్పోయే ఛాన్స్ ఉండదు.
- ‘స్లీప్ మోడ్’లో ఉన్నప్పుడు.. ఫుల్ షట్‌డౌన్ కంటే త్వరగా యాప్‌లు రీలోడ్ అవుతాయి. ఇలాంటి దశలో పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ ఛార్జ్ అయిపోయినప్పుడు ర్యామ్‌లో ఉన్న సమాచారం అంతా పోతుంది. అందుకే ఈ మోడ్‌లో ఉంచేటప్పుడు పవర్ సప్లై జరిగేలా చూసుకోవడం అవసరం.
- కంప్యూటరులో ‘షట్ డౌన్’ ఆప్షన్ వాడితే.. అప్పటి వరకు ఓపెన్ చేసి ఉన్న యాప్‌లన్నీ క్లోజ్ అవుతాయి. ఏ అప్లికేషన్, డేటా కూడా ప్రిజర్వ్ కాదు. మళ్లీ మీరు పీసీ ఓపెన్ చేయాలనుకుంటే.. మొత్తం రీబూట్ అవుతుంది. షట్‌డౌన్ ఆప్షన్ అనేదది కంప్యూటర్‌కు పవర్‌కట్ చేస్తుంది. స్లీప్, హైబర్నేట్లతో పోలిస్తే కంప్యూటర్ షట్‌డౌన్ కావడానికి ఎక్కువ టైమే పడుతుంది.
Also Read: Rajya Sabha 2024 : 2024లో ‘పెద్దల సభ’లో పెద్ద మార్పులివీ.. !
- కొద్దిసేపు కంప్యూటర్‌ను ఉపయోగించము అనుకున్న టైంలో కంప్యూటరును స్లీప్ మోడ్‌లో ఉంచొచ్చు. కంప్యూటరు బ్యాటరీలో తగినంత ఛార్జింగ్ ఉన్నప్పుడే ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకుంటే బెస్ట్.
- కంప్యూటరు బ్యాటరీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు సిస్టమ్‌ను ఎక్కువ టైం ఉపయోగించాలనుకుంటే హైబర్నెట్ ఆప్షన్ బెస్ట్.
- కంప్యూటరులో వర్క్ అంతా పూర్తయ్యాక షట్‌డౌన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- కంప్యూటరు ప్రతిసారీ కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్లు అందించిన ఫాస్ట్ స్టార్టప్ ఆప్షన్‌ను(Computer Power Options) వాడాలి.