Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తిరుచిరాపల్లి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున మినీవ్యాన్‌ను లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదం (Road Accident)లో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు.
- By Gopichand Published Date - 11:17 AM, Sun - 19 March 23

తిరుచిరాపల్లి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున మినీవ్యాన్‌ను లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదం (Road Accident)లో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
పూర్తి వివరాలలోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ మినీ వ్యాన్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో మినీ వ్యాన్‌లో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read: Rs 100 Cr Fine: కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించిన ఎన్‌జీటీ
ఈ ఘటనపై తిరుచ్చి ఎస్పీ సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. తిరుచ్చి జిల్లా తిరువాసి సమీపంలో తిరుచ్చి-సేలం జాతీయ రహదారిపై వేకువజామున లారీని వ్యాన్ ఢీకొనడంతో ఓ చిన్నారి, మహిళ సహా ఆరుగురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఆయన తెలి

Related News

Tamil Nadu: మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల 1000 రూపాయలు.. ఎప్పటి నుంచి అంటే..?
తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబరు నుంచి అర్హులైన మహిళా కుటుంబ పెద్దలకు నెలవారీ రూ.1,000 సహాయ పథకం ప్రకటించడం అత్యంత పెద్దది.