6 Chain Snatchings: రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్.. హైదరాబాద్ లో 6 చోట్ల స్నాచింగ్స్
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఆరు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.
- Author : Balu J
Date : 07-01-2023 - 1:35 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల వ్యవధిలో నగరంలోని ఆరు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లోని లో ఉదయం 6.20 గంటలకు ఓ మహిళ నుంచి గొలుసు లాక్కున్న ముఠా ఆ తర్వాత కల్యాణపురి, ఉప్పల్ (ఉదయం 6.40) నాగేంద్రనగర్, నాచారం (ఉదయం 7.10), రవీందర్ నగర్, ఓయూ పీఎస్ (ఉదయం 7.40), చిలకలగూడ పీఎస్ సమీపంలోకి వెళ్లింది. ఉదయం 8.10 గంటలకు రామాలయం గుండు (ఉదయం 8) రాంగోపాల్‌పేట్ PS రైల్వే స్టేషన్ సమీపంలో వరుసగా స్నాచింగ్స్ కు పాల్పడింది.
“ఈ నేరాలన్నీఢిల్లీ గ్యాంగ్ చేస్తున్నట్టు ప్రజలు అనుమానిస్తున్నారు. అంతర్రాష్ట్ర గ్యాంగ్ చేసినట్టు తెలుస్తోంది. రైల్వే స్టేషన్లలో, ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తర రాష్ట్రాలు, విమానాశ్రయాల వైపు రైళ్లు వెళ్లే ప్లాట్‌ఫారమ్‌ల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తే దొంగలు దొరకవచ్చు’’ అని డీసీపీ క్రైమ్స్ చెప్పింది. ఈ నేరాలకు సంబంధించిన ముఠాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించగా, పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వరుస ఘటనలతో మహిళలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.