Shraddha: స్నేహితుడిని కలిసినందుకే శ్రద్ధా వాకర్ హత్య.. చార్జిషీట్‌లో సంచలన విషయాలు!
దేశవ్యాప్తంగా కలకలం రేపిన శ్రద్ధా వాకర్ హత్య గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
- By Nakshatra Updated On - 08:45 PM, Tue - 24 January 23

Shraddha: దేశవ్యాప్తంగా కలకలం రేపిన శ్రద్ధా వాకర్ హత్య గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆమె తన ఫ్రెండ్‌ను కలవడం నిందుతుడు అఫ్తాబ్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని.. ఆ కోపంలోనే శ్రద్ధా వాకర్‌ను హత్య చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు 6,629 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. దాదాపు 150 మంది సాక్షులు నుంచి వివరాలు సేకరించారు.
శ్రద్ధా వాకర్ ఓ ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిందని.. అది అఫ్తాబ్ కు కోపం తెప్పించిందని పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర ఆగ్రహంతో అదే రోజు ఆమెను చంపేశాడని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు మీను చౌదరి వెల్లడించారు. ఆమె డెడ్ బాడీని ఐదు రకాల పదునైన ఆయుధాలతో పాటు రంపంతో 35 ముక్కలుగా నరికి ఆ శరీర భాగాలను మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో వేర్వేరు చోట్ల పడేసి వచ్చాడని తెలిపారు.
గత నెలలో, మెహ్రౌలీ అటవీ ప్రాంతంతో పాటు గురుగ్రామ్‌లో పోలీసులు గుర్తించిన ఎముకలు శ్రద్ధావేనని డిఎన్‌ఎ పరీక్షలో తేలింది. ఆమె ఎముకల డిఎన్ఏ ఆమె తండ్రి డిఎన్ఏ తో సరిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదునైన రంపంతో శరీరాన్ని ముక్కలుగా చేయడం, అదే ఆయుధంతో ఆమె ఎముకలను కత్తిరించినట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిసింది. మంగళవారం ఎయిమ్స్ లో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదికను కూడా ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు.
నిందుతుడు అఫ్తాబ్ ఇప్పటికే నేరం అంగీకరించాడు. దింతో కోర్ట్ తీర్పు ఎలా ఉండనుందో అందరు ఎదురుచుస్తునారు. మరోవైపు నిందుతుడు కస్టడీ కూడా ముగియడంతో ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కస్టడీ పొడిగించింది.

Related News

Car Hits Scooty: ఢిల్లీలో మరో దారుణం.. స్కూటీని ఢీకొట్టిన కారు.. 350 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఒకరు మృతి
ఢిల్లీ (Delhi)లోని కేశవపురంలో కంఝవాలా లాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. జనవరి 27 తెల్లవారుజామున 3 గంటలకు టాటా జెస్ట్ వాహనం స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళుతుండగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.