Shraddha Walker: శ్రద్ధ వాకర్ కేసులో విస్తుపోయే విషయాలు… 35 ముక్కలుగా నరికి, ఎముకలు గ్రైండర్!
మనసు మనసు పంచుకుని నమ్ముకుని తిరిగిన ప్రియుని చేతిలోనే హత్యకు గురైన సంఘటన..
- By Nakshatra Published Date - 09:48 PM, Tue - 7 February 23

Shraddha Walker: మనసు మనసు పంచుకుని నమ్ముకుని తిరిగిన ప్రియుని చేతిలోనే హత్యకు గురైన సంఘటన.. శ్రద్ధ వాకర్ కేసు అందరికీ తెలిసిందే. అయితే విచారణ జరుగుతున్న కొద్దీ ఈ సంఘటనలో మరిన్ని ఘోరమైన సంఘటనలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలకమైన పురోగతి సాధించారు పోలీసులు. ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసులో పోలీసులు దాదాపుగా విజయం సాధించారు. దీనితో ఇది కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారనుంది.
దర్యాప్తులో భాగంగా.. మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు.. శ్రద్ధా వాకర్ తండ్రి నుంచి సేకరించిన నమూనాలు.. డీఎన్‌ఏ పరీక్షల్లో సరిపోలినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా విసిరేసిన విషయం తెలిసిందే. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా.. శ్రద్ధా శరీర భాగాల కోసం పోలీసులు గాలించారు. మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో దవడ భాగాలు సహా 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
“మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఎముకలకు సంబంధించిన డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది.. శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ నుంచి సేకరించి డీఎన్ఏ నమూనాలతో ఇవి సరిపోలాయి”’ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. డీఎన్ఏ విశ్లేషణ కోసం ఎముకల నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. మరోవైపు, నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు నిర్వహించిన పాలీగ్రాఫ్ టెస్ట్ నివేదికను పోలీసులకు ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ అందజేసింది.
తాజాగా చార్జిషీట్ లో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. అఫ్తాబ్ తన ప్రియురాలు శ్రద్ధను సుత్తితో కొట్టి చంపాడు. ఆ తర్వాత 3 కత్తులతో 35 ముక్కలుగా నరికి ఆ ముక్కలను ఫ్రిజ్ లో పెట్టాడు. బ్లోటార్చ్ తో శ్రద్ధ వెళ్ళాను కత్తిరించాడు. ఇక ఎముకలను స్టోన్ గ్రైండర్ లో వేసి పిండి చేసి, ఆ ఎముకల పిండిని అడవిలో చల్లాడు. ఈ విషయాలను తాజా చార్జిషీట్ లో పోలీసులు వెల్లడించారు.

Related News

Tejashwi Yadav : తండ్రైన బీహార డిప్యూటీ సీఎం..ఫొటో షేర్ చేసిన తేజస్వీ యాదవ్
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తండ్రిగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన భార్య రాజశ్రీ యాదవ్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని స్వయంగా తేజస్వి యాదవ్ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమార్తెను చేతులో ఎత్తుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందని..దేవుడు ఆనందాన్ని కుమార్తె రూపంలో బహుమతిగా పంప�