AP Ration Dealers: రేషన్ డీలర్ లకు షాకిచ్చిన జగన్ సర్కార్!
ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు షాక్ ఇచ్చింది. గన్నీ బ్యాగ్ లకు డబ్బులు చెల్లించబోమని అధికారులు రేషన్ డీలర్లకు తేల్చి చెప్పారు. రేషన్ డీలర్ల సమస్యలపై మంత్రి కొడాలి నాని, సబ్ కమిటీ ఇచ్చిన హమీలను అధికారులు పట్టించుకోలేదని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.
- By Hashtag U Published Date - 09:48 AM, Wed - 22 December 21

ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు షాక్ ఇచ్చింది. గన్నీ బ్యాగ్ లకు డబ్బులు చెల్లించబోమని అధికారులు రేషన్ డీలర్లకు తేల్చి చెప్పారు. రేషన్ డీలర్ల సమస్యలపై మంత్రి కొడాలి నాని, సబ్ కమిటీ ఇచ్చిన హమీలను అధికారులు పట్టించుకోలేదని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. అక్టోబర్ 27 డీలర్ల ఆందోళన సమయంలో మంత్రులను డీలర్స్ ప్రతినిధులు కలిశారు. నెల రోజుల్లో గన్నీ బ్యాగ్స్ కు డబ్బులు ఇప్పిస్తాని మంత్రులు కొడాలి నాని, కన్న బాబు, రంగనాధరాజులు చెప్పారని.. జిఒ 10ప్రకారం గోనె సంచులు ప్రభుత్వానివేనని మంత్రులు చెప్పారని తెలిపారు. అయితే తాజాగా అధికారులు మాట మారుస్తున్నారని డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్ణయంతో రేషన్ డీలర్లు ఆందోళనకు సిద్దమవుతున్నారు. గతంలో సంచికి 20చొప్పున ప్రభుత్వం చెల్లించిందని.. ఐదు నుంచి పది వేలు వచ్చే కమిషన్ తో షాప్ అద్దె, దిగుమతి చార్జీలు పోగా కుటుంబం ఎలా గడవాలని డీలర్లు వాపోతున్నారు. సిఎం జగన్ స్పందించి న్యాయం చేయాలని డీలర్స్ అసోషియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.