7 Drowned: తమిళనాడులోని ఓ నదిలో ఏడుగురు బాలికల గల్లంతు
తమిళనాడులోని కడలూరు జిల్లా నెల్లికుప్పంలో విషాదం చోటుచేసుకుంది.
- By Prasad Published Date - 09:17 PM, Sun - 5 June 22

తమిళనాడులోని కడలూరు జిల్లా నెల్లికుప్పంలో విషాదం చోటుచేసుకుంది. నెల్లికుప్పం సమీపంలోని నదిలో ఏడుగురు బాలికలు గల్లంతైయ్యారు. మృతులను ఎ. మోనిషా (16), ఆర్ ప్రియదర్శిని (15), ఆమె సోదరి ఆర్ దివ్య దర్శిని (10), ఎం నవనీత (18), కె ప్రియ (18), ఎస్ సంగవి (16), ఎం కుముద (18)లుగా గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో వీరంతా గెడ్డిలం నదికి అడ్డంగా ఉన్న చెక్ డ్యామ్‌లోకి దిగగా ప్రమాదవశాత్తు నీటమునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.