HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sc Verdict In Favour Of Telangana Govt On Manikonda Jagir Case

Manikonda Jagir Case: తెలంగాణ సర్కారుకు మణికొండ దర్గా భూములు

  • Author : Hashtag U Date : 07-02-2022 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

మ‌ణికొండ జాగీర్ భూముల వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చింది. సుప్రీంకోర్టులో ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో 1654 ఎకరాల భూమి స‌ర్కార్ కు ద‌క్కిన‌ట్ల‌యింది.

ఎన్నో ఏళ్లుగా ఈ భూముల‌పై ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య పంచాయితీ న‌డుస్తోంది. ఇంత‌కుముందు హైకోర్టులో వాద‌న‌లు కొన‌సాగాయి. 2012 ఏప్రిల్‌ 3న వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా ఉన్న‌త న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. తాజాగా ఆ తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2016 నుంచి ఈ భూముల కేసు సుప్రీంకోర్టులో న‌లుగుతోంది. 1654 ఎకరాల‌ 32 గుంటల భూమి త‌మ‌దేనంటూ వక్ఫ్‌ బోర్డు… వక్ఫ్ ట్రైబ్యునల్ మద్దతుతో కోర్టుకెక్కింది. అయితే సుప్రీం తాజా తీర్పుతో ఆ భూమిపై ప్రభుత్వానికి సర్వ హక్కులు ద‌క్కాయి.
దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు మొత్తం 1,654 ఎకరాలను ప్రకటిస్తూ 2006లో వక్ఫ్‌ బోర్డు జారీచేసిన ఎర్రాటా నోటిఫికేషన్ వివాదంగా అయింది. అయితే అక్కడ కేవలం ఒక ఎకరం మాత్రమే దర్గాకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ భూముల్లో కొంత భాగం అప్పటికే 2001లో ఐఎస్‌బీకి, 2004 తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్, ఇతరులకు కేటాయించారు. అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కేటాయింపులు చేశాయి. వీటిని దేవాదాయ శాఖ భూములుగా భావించిన ప్రభుత్వం.. ఐటీ సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీల కోసం భూములను విక్రయించడం, కేటాయింపులు చేయ‌డం చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ఆ భూములు దర్గాకు చెందినవని వాదించింది. అవి దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలీకి దాదాపు 150 సంవత్సరాల క్రితం ప్రసాదించిన ఆస్తి అని తెలిపింది. ఇందుకు వక్ఫ్ బోర్డు ట్రెబ్యునల్‌ మద్దతు తెలిపింది. దీంతో హైకోర్టు ద‌గ్గ‌ర‌కు ఈ పంచాయితీ వెళ్లింది. కోర్టు వక్ఫ్‌ బోర్డు‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాన్ని స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వం సుప్రీంకు వెళ్లింది. చాలా కాలం పాటు వాదనలు జరిగాయి. తాజాగా ఆ భూములు ప్ర‌భుత్వానికి చెందుతాయ‌ని సుప్రీం ధర్మాసం తేల్చిచెప్పింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Manikonda jagir case
  • manikonda land
  • supreme court verdict
  • telangana government

Related News

Another Fantastic Piece of Good News for Women: Mahila Shakti Super Bazars

Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్ భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తొలి విడతగా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డీమార్ట్ తరహా మహిళా శక్తి సూపర్ బజార్లను, అలాగే ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, రైస్‌మిల్లును ఏర్పాటు చేయనున్నారు. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. అందుకు అవసరమైన భూసేకరణ కోసం జిల

  • Health Scheme for Telangana Government Employees

    Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..

Latest News

  • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

  • ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు

  • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd