Samantha: చైతుతో డివోర్స్ పై సమంత స్పందన
- Author : hashtagu
Date : 10-01-2022 - 1:44 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ నటి సమంత, నాగ చైతన్యతో తన నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ.. గత సంవత్సరం సెప్టెంబరులో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా..ఆ ఘటన పై సమంత స్పందిస్తూ.. తన జీవితంలోనే అది అత్యంత బాధాకరమైనదని.. మానసికంగా చాల ఒత్తిడికి లోనయ్యానని సమంత వెల్లడించింది. అయితే, ఆ సమయంలో తన స్నేహితులు, మానసిక వైద్యుల సహాయంతో
తిరిగి మాములుగా.. మారానని అన్నారు. మానసిక ఒత్తిడి సహజం అని.. అవసరం అనుకుంటే మానసిక వైద్యులను సంప్రదించాలని అన్నారు.
రోషిని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకియాట్రీ ఎట్ యువర్ డోర్ స్టెప్ సమావేశంలో మాట్లాడుతూ.. అనేక మందికి మానసిక సమస్యల అవగాహన లేదని.. మానసిక వైద్యులను సంప్రదించడానికి నిరాకరిస్తారని ఆమె అన్నారు. సమాజంలో మానసిక రోగాలపై అవగాహన కల్పించాలని ఆమె సమాజాన్ని ఉద్దెశించి అన్నారు. తన మాజీ భర్త నాగ చైతన్య తో విడిపోయినప్పుడు కూడా మానసిక సమస్యలతో భాధపడ్డానని.. ఆ సమయంలో బంధువులు, స్నేహితులు, మానసిక వైద్య నిపుణుల సహాయం తో త్వరగా బయట పడ్డానని ఆమె అన్నారు.