Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు కోసమే పవన్.. జనసేనానిపై సజ్జల ఫైర్
జనసేన అధినేత పవన్ టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన తరువాత వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
- By Prasad Published Date - 08:35 PM, Thu - 14 September 23

జనసేన అధినేత పవన్ టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన తరువాత వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పవన్‌పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు కోసం కలిసి పోటీ చేసి.. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వారిద్దరూ కలుసుకున్నప్పటికీ అసలు ఎప్పుడు విడిపోయారని సజ్జల ప్రశ్నించారు. ప్రస్తుతం తమకు 75% కంటే ఎక్కువ మద్దతు ప్రజల్లో ఉందని తెలిపారు. వివిధ అంశాలు తెరపైకి వచ్చినా రానున్న ఎన్నికల్లో తమకు దాదాపు 60% ఓట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి రూ. 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు