HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rumours Swirl Over China Defense Minister Li Shangfu Missing

Defense Minister Missing : చైనా రక్షణమంత్రి మిస్సింగ్ .. ఏమయ్యారు ?

Defense Minister Missing :  చైనా ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది.

  • By Pasha Published Date - 01:04 PM, Mon - 11 September 23
  • daily-hunt
Defense Minister Missing
Defense Minister Missing

Defense Minister Missing :  చైనా ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. గతంలో చైనా విదేశాంగ మంత్రిగా పనిచేసిన క్విన్ గ్యాంగ్  దాదాపు నెల రోజుల పాటు మిస్సవడంతో కలకలం రేగింది. హాంకాంగ్ కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్టుతో అఫైర్ ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకొని చైనా ఆర్మీ ఇంటరాగేట్ చేసిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత విదేశాంగ మంత్రిగా మరో కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఇదే సీన్ చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు  విషయంలోనూ రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 12 రోజులుగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు కనిపించడం లేదని పేర్కొంటూ జపాన్‌లోని అమెరికా రాయబారి రహ్మ్ ఇమాన్యుయేల్ ట్వీట్ చేయడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. చైనా రక్షణమంత్రి ఎందుకు మిస్సయ్యారు ? ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి ? ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారా ? అనేది ఇంకా తెలియరావడం లేదు.

Also read : CBN Lawyer Comments : బెంగాల్ మంత్రులకు హౌస్ రిమాండ్ ఇచ్చారు.. చంద్రబాబుకూ ఇవ్వాలి : లూథ్రా 

President Xi's cabinet lineup is now resembling Agatha Christie's novel And Then There Were None. First, Foreign Minister Qin Gang goes missing, then the Rocket Force commanders go missing, and now Defense Minister Li Shangfu hasn't been seen in public for two weeks. Who's going…

— ラーム・エマニュエル駐日米国大使 (@USAmbJapan) September 8, 2023

ఈనేపథ్యంలో చైనా అధ్యక్షుడు  షి జిన్‌పింగ్ ఇటీవల దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను స్వయంగా సందర్శించారు. ఆయన వెంట రక్షణ మంత్రి లేరు.  ఐక్యత, స్థిరత్వం సూత్రాలతో సైన్యం ముందుకు సాగాలని ఈసందర్భంగా షి జిన్‌పింగ్ (Defense Minister Missing) పిలుపునిచ్చారు. సైనిక అంశాలపై స్వయంగా చైనా అధ్యక్షుడు సమీక్షించడం .. రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు  కనిపించకుండా  పోవడం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాలో మీడియా స్వేచ్ఛ లేకపోవడంతో.. అక్కడ జరిగే ఇలాంటి కీలక పరిణామాలపై త్వరగా ప్రపంచానికి తెలియడం లేదు. రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు చివరిసారిగా ఆగస్ట్ 29న బీజింగ్‌లో జరిగిన 3వ చైనా-ఆఫ్రికా శాంతి మరియు భద్రతా ఫోరమ్‌ సమావేశంలో ప్రసంగం చేస్తూ కనిపించారు. ఆయన మీడియా ముందు కనిపిించడం అదే లాస్ట్ . ఆయన మిస్సింగ్ పై చైనా ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచిచూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • China Defense Minister
  • China military
  • chinese president
  • Defense Minister Missing
  • xi jinping

Related News

    Latest News

    • ‎Pregnancy Diet: తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తప్పకుండా తినాల్సిందే!

    • ‎Diwali: దీపావళి రోజు ఏ దీపాలను వెలిగించాలి.. నూనె, నెయ్యి.. దేనిని ఉపయోగించాలో తెలుసా?

    • ‎Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?

    • Harish Rao: భర్తను తలచుకొని ఏడుస్తే.. చిల్లర రాజకీయాలా? – హరీశ్‌రావు ఫైర్

    • Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!

    Trending News

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

      • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

      • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

      • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd