RS Praveen: తెలంగాణ టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి: ఆర్ఎస్
- By Balu J Published Date - 11:07 PM, Fri - 31 May 24

RS Praveen: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. విద్యా సంవత్సరం ఇంకొక వారం రోజుల్లో మొదలు కాబోతున్నది. రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు,బదిలీలు ఇంకెప్పుడు? అని ప్రశ్నించారు. టీచర్లు ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి? టీచర్లు తమ ప్రమోషన్ల విషయంలో చీటికి మాటికి కోర్టుల గడప తొక్కుతున్నారు? అని మండిపడ్డారు. టీచర్ల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం? ఇదేనా కాంగ్రెస్ మార్కు “మార్పు” అంటే? ఏమిటి అని ప్రశ్నించారు.
‘‘ప్రశ్నించే గొంతుకలం అంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళ ఆచూకీ ఎక్కడ? ఆ గొంతులు ఇప్పుడు ఎందుకు మూగబోయాయి? తక్షణమే ముఖ్యమంత్రి & విద్యా శాఖ మంత్రి స్పందించి వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ప్రారంభానికి ముందే ఎలాంటి కేసులు,న్యాయస్థానాల జోక్యం లేకుండా కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసి వేగవంతంగా టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్ ఎస్ డిమాండ్ చేశారు.