Hyderabad : హైదరాబాద్ షాహీన్ నగర్‌లో దోపిడీ.. బంగారం నగదు అపహరణ
హైదరాబాద్ షాహీన్‌నగర్‌లో ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. మంగళవారం రాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, నగదుతో
- By Prasad Published Date - 08:42 AM, Thu - 4 May 23

హైదరాబాద్ షాహీన్‌నగర్‌లో ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. మంగళవారం రాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, నగదుతో ఉడాయించారు. ఇంటి యజమాని మహ్మద్ అహ్మద్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. లాకర్ తాళం పగులగొట్టి ఐదు తులాల బంగారు వస్తువులు, రూ. 40,000 నగదు, బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి భాస్కర్ తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ఇంటికి వెళ్లి వేలిముద్రలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.