Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..పలువురికి గాయాలు
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- By Prasad Published Date - 10:18 AM, Sat - 20 August 22

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందారు. జైసల్మేర్ రామ్‌దేవ్ర ఆలయానికి వెళ్తున్న క్రమంలో.. వేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పాలి జిల్లా సుమేర్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, కొన్ని ఆంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌కర్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లు చేశారు