Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- Author : Prasad
Date : 25-05-2026 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం, జాతీయ రహదారి 44పై చంద్రాయనపల్లి వద్ద వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక లారీ టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో, ఆ లారీ రోడ్డుపైనే ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో లారీ వెనుక వస్తున్న వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు కార్లు అతివేగంగా ఢీకొన్నాయి. అదే సమయంలో, కార్ల వెనుక నుండి కొబ్బరికాయలతో వస్తున్న ఒక లారీ వాటిని పక్క నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్లు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.