4 Killed : కర్ణాటకలో లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
కర్నాటకలో కారు-లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో
- By Prasad Published Date - 08:11 AM, Mon - 5 June 23

కర్నాటకలో కారు-లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఇసుకతో కూడిన లారీని కారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కారులోని నలుగురు వ్యక్తులు హాసన్ వైపు వెళ్తుండగా జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని తిరుమలపుర గ్రామం వద్ద లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు తుమకూరుకు చెందినవారు కాగా, మరో ఇద్దరు వరుసగా రామనగర, శివమొగ్గలకు చెందినవారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని నాగ్‌పూర్-నాగ్‌బిడ్ మార్గ్ సమీపంలో మరో ప్రమాదం జరిగింది. ఈ కారు ఓ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు చాలా వేగంగా వచ్చి బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. కారు భాగాలను కత్తిరించిన తర్వాత మృతదేహాలను వెలికితీశారు.