Road Accident : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 36 మందికి గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందగా, 36 మంది...
- By Prasad Published Date - 07:47 AM, Mon - 5 December 22

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందగా, 36 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 40 మంది ప్రయాణికులతో పికప్ వాహనం బర్దేభటాకు వెళుతుండగా అంతఘర్ పోలీస్ పోస్ట్ పరిధిలోని పోడెగావ్ – లంకన్హర్ గ్రామాల మధ్య సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందని అంతఘర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఖోమన్ సిన్హా తెలిపారు.
ఫంక్షన్‌కి వెళ్లి బర్దేభటాకు తిరిగి వస్తున్న వాహనం ఆలయం సమీపంలో బోల్తా పడింది. అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 36 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.