Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబ్‌నగర్‌కి చెందిన విద్యార్థి మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి అమెరికాలోని ఇల్లినాయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో
- By Prasad Published Date - 07:03 AM, Thu - 25 May 23

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి అమెరికాలోని ఇల్లినాయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ మహేశ్ (25) కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. మహేష్, అతని స్నేహితులు శివ, శ్రీ లక్ష్మి మరియు భరత్‌లు మంగళవారం రాత్రి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. మహేష్ మరణవార్త తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.