Road Accident: మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- By Gopichand Published Date - 11:27 AM, Thu - 16 February 23

యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read: Soldier Killed: డీఎంకే నేత దాడిలో మృతి చెందిన సైనికుడు
పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికులు డ్యూటీకి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.