New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ
ఆచారాల ప్రకారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంతో దానిపై రాజకీయం కూడా మొదలైంది
- By Praveen Aluthuru Published Date - 12:52 PM, Sun - 28 May 23

New Parliament Building: ఆచారాల ప్రకారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంతో దానిపై రాజకీయం కూడా మొదలైంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు దీనిని బహిష్కరించడంతో పాటు ఆర్జేడీ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది.
పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం లాలూ పార్టీ ఆర్జేడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. కొత్త పార్లమెంట్ నిర్మాణం శవపేటిక లాంటిదని, త్వరలోనే దేశ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని శవపేటికలో పెడతారని ఆర్జేడీ పేర్కొంది.
ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023
ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్ పై ఎంఐఎం నేత అసదుద్దీన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసదుద్దీన్ మాట్లాడుతూ… కొత్త పార్లమెంటు భవనాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేది. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదన్నారు. ఇక ఆర్జేడీ పార్టీ అంశాన్ని లేవనెత్తుతూ ఆర్జేడీకి స్టాండ్ లేదని అభిప్రాయపడ్డారు ఒవైసీ. ఆర్‌జేడీ పార్లమెంటును శవపేటికతో ఎందుకు పోలుస్తున్నారు? వాళ్లు ఇంకేమైనా మాట్లాడి ఉండొచ్చు. ఈ యాంగిల్ ఎందుకు తీసుకురావాలి? అంటూ చురకలంటించారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.
Read More: Victory On Paralysis : పక్షవాతంపై విజయం.. మెదడు, వెన్నెముకపై కంట్రోల్