KVP Letter to CM Revanth : కేవీపీ – కేసీఆర్ సాన్నిహిత్యం తెలిసే రేవంత్ ఆలా అన్నారా..?
KVP Letter to CM Revanth : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపదేళ్లలో కేవీపీ హవా నడిచిందని రేవంత్ గట్టిగా నమ్ముతున్నాడట. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు దిక్సూచీలాగా కేవీపీ ఉన్నారని రేవంత్ కు పక్కా సమాచారం ఉందని అంటున్నారు
- By Sudheer Published Date - 01:41 PM, Sat - 5 October 24

అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ (Revanth Govt) ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైడ్రా (Hydraa) ను రంగంలోకి దింపి అనేక అక్రమ కట్టడాలను నేలమట్టం చేసారు. ఈ క్రమంలో అక్రమ ఫామ్ హౌస్‌లు కట్టుకున్న బీఆర్ఎస్ నేతల (BRS Leaders) జాబితాను ప్రకటిస్తూ మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) పేరును ప్రస్తావించారుసీఎం రేవంత్ రెడ్డి. తన పేరును ప్రకటించడం తో KVP తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్‌లో తన చరిత్ర ఇదే అంటూ పెద్ద లెటర్ రాశారు. తన బ్యాక్ గ్రౌండ్ ను సీఎం రేవంత్ (CM Revanth Reddy) గుర్తించలేకపోవడం తన దురదృష్టమన్నారు.
కేవీపీ పేరును సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద రహస్యమే ఉందని రేవంత్ వర్గీయులు అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపదేళ్లలో కేవీపీ హవా నడిచిందని రేవంత్ గట్టిగా నమ్ముతున్నాడట. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు దిక్సూచీలాగా కేవీపీ ఉన్నారని రేవంత్ కు పక్కా సమాచారం ఉందని అంటున్నారు. గతంలో కూడా ఆయన కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దానికి కారణం.. కేవీపీ,కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం. వారిని అది కలిపిందని ఆయన నమ్ముతున్నారు. కేవీపీ రేవంత్ కు రాసిన లేఖలో తాను కాంగ్రెస్ కు ఎంత సేవ చేశానో చెప్పుకొచ్చారు. తనపై ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే కేవీపీ ఆ లేఖ ద్వారా రేవంత్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని భావించవచ్చు.
కేవీపీ-రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో ప్రధాన అంశాలు చూస్తే..
లేఖలో ప్రస్తావించిన, లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే, సీఎం రేవంత్‌రెడ్డికి కేవీపీ నేరుగానే సవాల్ విసిరినట్టు అర్థమవుతున్నది. తన ఫాంహౌజ్‌పై ఆరోపణలు వచ్చినరోజే సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశానని గుర్తుచేస్తూ, ఇప్పటికైనా వెంటనే అధికారులను తన ఫాంహౌజ్‌కు పంపించాలని కోరారు. మార్కింగ్ ప్రక్రియ పార్శదర్శకంగా కొనసాగాలని, మార్కింగ్ చేసే సమయం, తేదీ తనకు ముందే తెలియజేయాలని సూచించారు. తద్వారా ప్రస్తుత ప్రక్రియ పారదర్శకంగా లేదని చెప్పకనే చెప్పారు.
‘పల్లంరాజు’ వ్యవహారంలా కాకుండా తనకు ముందే తేదీ చెప్పాలని పరోక్షంగా హెచ్చరించారు. ‘మీరు, నేను కలుగజేసుకోకుండా, చట్టాన్ని తన పని తాను చేసుకొని పోనిద్దాం’ అని కేవీపీ పేర్కొనడం ద్వారా రేవంత్ తనను టార్గెట్ చేస్తున్నారనే సందేశం పంపారు. ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకోకుండా ఉంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందని సలహా ఇచ్చారు. మరి కేవీపీ విషయంలో రేవంత్ ఇంకాస్త ముందుకు వెళ్తారా..? లేక తగ్గుతారా అనేది చూడాలి.
Read Also : Tirumala: తిరుమలలో శ్రీవారి నామాలే మార్మోగాలి: సీఎం చంద్రబాబు