HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Repairs Of Aircraft Engines In Hyderabad From Now On Industry By The End Of 2024

Hyderabad: ఇకపై హైదరాబాదులోనే విమాన ఇంజన్ల రిపేర్.. ఎప్పటికీ పూర్తికానుందో తెలుసా?

హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఒక్కొక్కటిగా హైదరాబాదులో టెక్నాలజీకి అనుగుణంగా నిర్మిస్తున్నార

  • Author : Anshu Date : 18-07-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఒక్కొక్కటిగా హైదరాబాదులో టెక్నాలజీకి అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ హెల్త్ హబ్‌గా మారగా సాఫ్ట్ వేర్‌ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ ఆఫీసులను ఏర్పాటు చేసిన తరువాత ఇపుడు మరో పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కానుంది. అదే విమాన ఇంజన్లను రిపేర్‌ చేసే సంస్థ.. జీఎంఆర్‌ ఏవియేషన్‌ సెజ్‌ లో శాఫ్రాన్‌ ఎంఆర్‌వో యూనిట్‌ ఏర్పాటు కానుంది. ఇది 2024 ఏడాది చివరి నాటికి పూర్తి కానుండగా 2025 జనవరి నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ పరిశ్రమ ద్వారా నేరుగా 1000 మందికి పైగా ఉద్యోగావ అవకాశాలు రానున్నాయి. విమాన ఇంజిన్ లకు మరమ్మతులు, నిర్వహణ సేవలు అందించే కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఇందుకోసం జీఎంఆర్‌ గ్రూపు సంస్థ హైదరాబాద్‌ ఏవియేషన్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన శాఫ్రాన్‌కు భారతీయ అనుబంధ సంస్థ- శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్స్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో 23.5 ఎకరాలకు లీజు ఒప్పందం కుదుర్చుకుంది. శంషాబాద్‌లో విమానాశ్రయానికి పక్కనే జీహెచ్‌ఐఏఎల్‌కు చెందిన సెజ్‌ ప్రాంతంలో లీప్‌ టర్బోఫ్యాన్‌ ఇంజిన్ల ఎంఆర్‌ఓ సదుపాయాన్ని నిర్వహించడానికి శాఫ్రాన్‌ సిద్ధమవుతోంది.

దాదాపు 36,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కేంద్ర పనులు సెప్టెంబరులో ప్రారంభమై, 2024 చివరికి పూర్తవుతాయి. 2025 నుంచి సేవలు అందించే ఈ కేంద్రం వల్ల దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. శాఫ్రాన్‌ ఇప్పటికే జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లోని ఎస్‌ఈజడ్‌ ప్రాంతంలో కేబుల్‌ హార్నెసింగ్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ విడిభాగాల తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. జీఈ, శాఫ్రాన్‌కు చెందిన ఇంజిన్‌ నిర్వహణ శిక్షణ సదుపాయమూ కూడా ఇందులో ఉంది. హైదరాబాద్‌ ఏరోసిటీలో డొమెస్టిక్‌ టారిఫ్‌ ఏరియా కూడా ఉంది. దేశీయ సంస్థలతో పాటు పలు విదేశీ సంస్థలు ఈ ప్రాంతాల్లో యూనిట్లు నిర్వహిస్తున్నాయి. శాఫ్రాన్‌తో ఒప్పందం ఎంతో కీలకమైందని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగ సీఈఓ అమన్‌ కపూర్‌ అన్నారు. మొదటి ఏడాదిలో 100 ఇంజిన్లకు సర్వీస్‌ చేయగల సామర్థ్యంతో శాఫ్రాన్‌ ఎంఆర్‌ఓ యూనిట్‌ ఏర్పాటవుతుందట. అలాగే భవిష్యత్తులో 300 ఇంజన్లకు సామర్థ్యం విస్తరిస్తుందని అన్నారు. భారత్‌లో విస్తరణ కోసమే ఎంఆర్‌ఓ యూనిట్‌ నెలకొల్పుతున్నట్లు శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్స్‌ ఉపాధ్యక్షుడు నికోలస్‌ పోటియర్‌ వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aircraft engine
  • flight engine repair
  • hyderabad
  • Industry

Related News

New Liquor Brands

మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

ప్రపంచంలో కొన్ని వేల రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మందుబాబులు ఎక్కువగా తాగేది బీరే. కొంతమంది కొత్త వరైటీలు టేస్ట్ చూస్తారు. తెలంగాణలో మద్యం ప్రియులు ఈమధ్య బాగా యాక్టివ్ అయ్యారు. వారు రొటీన్ సరుకు వద్దంటున్నారు. కొత్త బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు కావాలంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. వారి కోరిక తీర్చేందుకు.. తెలంగాణలో కొత్త బ్రాండ్లను రానివ్వాలని డిసైడ్ అ

  • Fire Incident In Maitrivana

    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

Latest News

  • శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైర‌ల్‌!

  • ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు

  • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

  • పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!

Trending News

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd