Reliance Jio : రాజస్థాన్‌లో రేపు రిలయన్స్ జియో 5జీ సేవలు ప్రారంభం
రిలయన్స్ జియో 5జీ సేవలను రాజస్థాన్‌లో రేపు ప్రారంభించనున్నారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా...
- By Prasad Published Date - 10:08 PM, Fri - 21 October 22

రిలయన్స్ జియో 5జీ సేవలను రాజస్థాన్‌లో రేపు ప్రారంభించనున్నారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోని ప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం నుండి 5G సేవలను రేపు (శనివారం) ప్రారంభించనున్నట్లు జియో అధికారులు తెలిపారు. కంపెనీ ఛైర్మన్ ఆకాష్ అంబానీ సేవలను అంబానీ కుటుంబానికి చెందిన శ్రీనాథ్‌జీకి అంకితం చేస్తారు. 5G సేవల ప్రారంభం రాజస్థాన్‌లో ప్రజల జీవితాలను మారుస్తుందని.. ఇది వారిని ప్రపంచ పౌరులతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిస్తుందని జీయో అధికారి తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత నెలలో శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం నుండి రాష్ట్రంలో సేవలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 2015లో కూడా ముఖేష్ అంబానీ 4జీ సేవలను ప్రారంభించే ముందు శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించారు.