HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rcb Fan Offers Prayers At Kondagattu For Ipl 2025 Win

Viral : ఈసారి RCB క‌ప్ గెల‌వాలని.. కొండ‌గ‌ట్టు అంజ‌న్న హుండీలో చీటీ..

Viral : ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొట్టింది.. టోర్నమెంట్ మొదట్నుంచీ చివరి వరకూ వాళ్ల ఆటతో అందరినీ ఆకట్టుకున్నారు.

  • Author : Kavya Krishna Date : 31-05-2025 - 4:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kondagattu Rcb
Kondagattu Rcb

Viral : ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొట్టింది.. టోర్నమెంట్ మొదట్నుంచీ చివరి వరకూ వాళ్ల ఆటతో అందరినీ ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా జరిగిన క్వాలిఫయర్‌-1లో బలమైన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)ను ఓడించి ఫైనల్‌లోకి దూసుకుపోయారు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారైనా బెంగళూరు కప్పు గెలవాలని కోరుకుంటున్నారు.

Shahneel Gill: గుజ‌రాత్ టైటాన్స్ ఓట‌మి.. బోరున ఏడ్చిన గిల్ సోద‌రి!

ఆర్‌సీబీ గెలుపు కోసం కొందరు ఫ్యాన్స్ పూజలు కూడా మొదలుపెట్టారు. చాలామంది దేవాలయాలకు వెళ్లి తమ అభిమాన జట్టు ఫైనల్లో గెలవాలని మొక్కుకుంటున్నారు. ఈ క్రమంలో, ఒక ఆర్‌సీబీ అభిమాని తన భక్తిని, దేవుడిపై తనకున్న నమ్మకాన్ని ఆర్‌సీబీ టీమ్‌పై చూపించాడు. ఆ అభిమాని కొండగట్టు అంజన్న హుండీలో ఒక చీటీ రాసి వేశాడు. ఆ చీటీలో “ప్లీజ్ దేవుడా.. ఈసారి ఆర్‌సీబీ ట్రోఫీ గెలవాలి.. ఈసారి కప్ మనదే” అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదే తరహాలో, క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌తో బెంగళూరు ఆడుతున్నప్పుడు ఒక మహిళా అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు కూడా నెట్టింట్లో హల్‌చల్ చేసింది. “ఈసారి ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇస్తా” అని ప్లకార్డుపై రాసి స్టేడియంలో చూపించిందామె. దీనిపై కింగ్ కోహ్లీ హ్యాష్‌టాగ్‌ను కూడా పెట్టడం విశేషం. అభిమానుల కోరిక మేరకు బెంగళూరు ఈసారి టైటిల్ సాధిస్తుందేమో చూడాలి. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లి, త్రుటిలో కప్ చేజార్చుకుంది. ఇప్పుడు నాలుగోసారి ఆర్‌సీబీ ఫైనల్‌కు వెళ్లింది. జూన్ 3న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు (ఆదివారం) ఇదే వేదికలో జరిగే క్వాలిఫయర్‌-2 (ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్) విజేతతో ఆర్‌సీబీ ఫైనల్లో తలపడనుంది.

Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం: భట్టి విక్రమార్క


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricket Emotions
  • IPL 2025
  • IPL Final
  • IPL Memes
  • Kondagattu Temple
  • rcb
  • rcb fans
  • RCB Prayers
  • royal challengers bangalore
  • virat kohli

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

  • Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

    Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

Latest News

  • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

  • Flaxseed: రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలు ఇవే…!

  • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

  • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd