India: విచారణకు హాజరైన కంగనా..
- By hashtagu Published Date - 01:05 PM, Thu - 23 December 21

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో విచారణ నిమిత్తం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను ఆమె తీవ్రవాదులతో పోల్చారు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో ఎప్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసులు కంగనా రనౌత్ ను జనవరి 25 వరకు అరెస్టు చేయము అని కోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యం లో ఆమె విచారణకు హాజరయ్యారు. ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఆమె గతంలోనూ చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే లాగా తన వ్యాఖ్యలు ఉన్నాయి అని ఆమె అకౌంట్ ను ట్విటర్ శాశ్వతంగా రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కంగనా.. ఇటీవల ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీ ని కూడా కేంద్రం సమకూర్చింది. ఈ వ్యాఖ్యలు చేసే రెండు రోజుల ముందు తనకు పద్మశ్రీ కూడా లభించింది విశేషం.