Politics: దేశం కోసం వ్యవసాయం చేస్తున్నాం: రాకేశ్ టికాయత్
- By hashtagu Published Date - 01:43 PM, Mon - 27 December 21

ప్రధాని మోదీ క్షమాణలను చెప్పాలని రైతులెవరూ కోరుకోలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఏ నిర్ణయాన్నైనా రైతుల ఆమోదం లేకుండా తీసుకోవద్దని మాత్రమే తాము ప్రధానిని కోరుతున్నామని తెలిపారు. దేశం కోసం తాము వ్యవసాయం చేస్తున్నామని, ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నామని… అయినప్పటికీ ఢిల్లీ మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని అన్నారు. మూడు వ్యవసాయచట్టాలను మళ్లీ తీసుకొస్తామన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలపై టికాయత్ స్పందిస్తూ… ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీని కూడా అవమానించేలా ఉన్నాయని చెప్పారు.