HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Raithu Gosa Bjp Bharosa In Khammam

Khammam BJP Meeting : కాంగ్రెస్ 4జీ ..బీఆర్ఎస్ 2జీ ..మజ్లిస్ 3జీ పార్టీలంటూ అమిత్ షా సెటైర్లు

కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు రైతులకోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఈరోజు మోడీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా 28 వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు

  • Author : Sudheer Date : 27-08-2023 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
'Raithu Gosa BJP Bharosa' in Khammam
'Raithu Gosa BJP Bharosa' in Khammam

కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)..మరోసారి కేసీఆర్ (CM KCR) ఫై నిప్పులు చెరిగారు. ఖమ్మం (Khammam )లో ఆదివారం నిర్వహించిన ‘రైతు గోస- భాజపా భరోసా’ (‘Raithu Gosa BJP Bharosa’ ) భారీ బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్‌ షా మాట్లాడుతూ ..తెలంగాణ లో రాబోయేది బిజెపి సర్కారే అని ,త్వరలోనే బిజెపి సీఎం భద్రాచలం వెళ్లి రాములవారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అమిత్ షా అన్నారు.

తెలంగాణ సాధన కోసం యువత ప్రాణ త్యాగాలు చేశారని, కానీ రజాకార్లతో కలిసి కేసీఆర్ కూర్చున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ రజాకార్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. కేసీఆర్ 9 ఏళ్లుగా రజాకర్లతో కలిసి పాలన కొనసాగిస్తున్నారని, ఆయనను సాగనంపాలంటే ప్రజలు బీజేపీకి మద్దతివ్వాలన్నారు. ఒవైసీ మద్దతు కోసం రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలగా, కమలం వికసిస్తుందని జోస్యం పలికారు.

‘ఖమ్మం ప్రజలారా.. నా మాట గుర్తుంచుకోండి.. ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ ఓడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుంది. భద్రాచలానికి దక్షిణభారతపు అయోధ్యగా పేరుంది.. భద్రాచల మందిర నిర్మాణం కోసం భక్తరామదాసు పడిన పాట్లు.. నిజాం ఏలుబడిలో జైలుపాలయ్యేందుకు కూడా సిద్ధమయ్యాడు. 17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా.. శ్రీరామనవమి (Sriramanavami) నాడు.. ప్రభుత్వం తరపున భద్రాచలం రాముడి కల్యాణ రాముడికి వస్త్రాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్.. ప్రభుత్వంలో మాత్రం.. కారు..భద్రాచలం (Bhadrachalam) వరకు వస్తుంది. కానీ మందిరంలోకి కారు వెళ్లకుండా.. ఆగుతోంది. ఎందుకంటే మందిరంలోకి వెళ్తే మిత్రుడికి బాధ కలుగుతుందనే ఆలోచన ఆయనది. కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. మీ పని అయిపోయింది.

Read Also : Mancherial : మంచిర్యాల బీఆర్ఎస్‌లో నిరసన.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చాలి..

రేపు బీజేపీ ప్రభుత్వం రాగానే.. మా సీఎం ఎవరున్నా.. కమల పుష్పాన్ని భద్రాచల రాముడి పాదపద్మముల ముందు అర్పిస్తాం. కేసీఆర్ భద్రాచలం ఇక రావాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ చేతుల్లోలేని కేసీఆర్ కారు.. మనకు అవసరం లేదు. వచ్చే ప్రభుత్వం.. మోడీ (PM Modi) గారి ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. అందులో సందేహం లేదు. బీజేపీ నేతల మీద దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు చేస్తే, బెదిరింపులకు గురిచేస్తే.. వాళ్లు వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారు. మా కిషన్ రెడ్డిని, మా బండి సంజయ్‌ను, మా ఈటల గారిని అడ్డుకుంటే.. మేం వెనక్కు తగ్గం.. కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు.

అలాగే కాంగ్రెస్ (Congress Party) అంటే వంశపారపర్యంగా పాలించే 4జీ పార్టీ అని, బీఆర్ఎస్ (BRS) పార్టీ 2జీ పార్టీ , ఒవైసీ (AIMIM) పార్టీ ఎంఐఎం 3జీ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ అయితే కేసీఆర్, కేటీఆర్ తో 2జీ పార్టీగా ఉందని సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చేది 2జీ, 3జీ, 4జీ పార్టీలు కాదని, ప్రజల పార్టీ మోడీ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఓ రేంజ్ లో డైలాగ్స్ పేల్చారు.

కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు రైతులకోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఈరోజు మోడీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా 28 వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. మోడీ ప్రభుత్వం20 లక్షలకోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కేసీఆర్.. గుర్తుపెట్టుకో.. ఏం జరిగినా.. ఒవైసీ, కేసీఆర్‌తో బీజేపీ పార్టీ.. పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు. బీజేపీ ఎప్పుడైనా ఒవైసీతో కలుస్తుందా..? బీఆర్ఎస్‌తో కలుస్తుందా..? ఈ రెండు పార్టీలతో కనీసం వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేదు. అలాంటిది వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ఆలోచన అర్థరహితం..” అని అమిత్ షా అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • Amith sha Speech
  • BJP public meeting
  • kcr
  • khammam
  • Raithu Gosa BJP Bharosa

Related News

Cm Revanth Mptc Zptc

Kaleshwaram Project : కాళేశ్వరం విషయంలో రేవంత్ సమాలోచనలు!

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏజీ (Advocate General) మరియు ఇతర న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు

  • Kaleshwaram project irregularities KCR, Harish Rao

    KCR : కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు బిగ్‌ రిలీఫ్‌.

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Latest News

  • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

  • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

  • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

  • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd