Bengaluru: బెంగళూరులో నోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్!
- By Balu J Updated On - 05:17 PM, Tue - 24 January 23

బెంగళూరు ఆర్కే మార్కెట్ కూడలిలో ఉన్న పైవంతెన పైకి హఠాత్తుగా ఓ యువకుడు సంచీ లోంచి డబ్బులు తీసి గాల్లోకి ఎగరేశాడు. వాటిని ఏరుకునేందుకు ఫ్లై ఓవర్ కింద జనం గుమిగూడారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. కేవలం 10 రూపాయల నోట్లనే విసిరినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. విడిగా డబ్బులు చెల్లి ప్రజల ప్రాణాలకు హానికరం తెచ్చే విధంగా అతని పనితీరు అది మంచి చెడుకు తనకే తెలుసు. కానీ తను చేసిన చర్యలో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ అంతరాయం అయింది దేవుడి వలన ఎవరికి ఏ అపాయం జరగలేదు.
#Bizarre in #Bengaluru#Traffic came to halt on #Sirsi Circle #flyover and the road below it (#KRMarket) after a well-dressed youth went about throwing currency notes. Who was he and why did he do it is not known. @NammaBengaluroo @WFRising @TOIBengaluru @peakbengaluru pic.twitter.com/zXB6mndKm6
— Rakesh Prakash (@rakeshprakash1) January 24, 2023

Related News

Manchu Laxmi Home Tour: మంచు లక్ష్మీ ఖరీదైన ఇల్లును చూశారా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల్లో మంచు లక్ష్మీ ప్రసన్న ఒకరు.