AP: ఏపీలో ఆ జిల్లాలో వర్ష సూచన.. అధికారులు అలర్ట్
- By Balu J Published Date - 11:19 PM, Mon - 18 March 24
AP: బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎల్లుండి అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.