Rahul Sipligunj : పొలిటికల్ ఎంట్రీ ఫై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ..
- Author : Sudheer
Date : 26-08-2023 - 2:13 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రసీమకు రాజకీయాలకు చాల దగ్గర సంబంధం ఉంది. ఎంతోమంది చిత్రసీమ నుండి రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రులుగా , మంత్రులుగా ప్రజలకు సేవ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అంతే కాదు పలువురు సినీ తారలు సైతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. నందమూరి తారకరామారావు (NTR) , జయలలిత (Jaya Lalitha), మోహన్ బాబు , టీ సుబ్బిరామి రెడ్డి , మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , నందమూరి బాలకృష్ణ (Balakrishna) , రోజా ఇలా ఎంతో మంది రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు. అందుకే రాజకీయ పార్టీలు సినీ గ్లామర్ ను వాడుకుంటుంటారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సినీ తారలతో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తుంది. మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుండే సినీ తారలను లైన్లో పెట్టుకుంటుంటున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున సిప్లిగంజ్ (Rahul Sipligunj) పోటీ చేయనున్నాడని.. గోషామహల్ నియోజకవర్గం (Goshamahal Constituency) నుంచి పోటీ చేస్తాడని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ ప్రచారం చూసిన చాలామంది అభిమానులు దీనిపై ఆరా తీస్తున్నారు. దీంతో తన తన రాజకీయ అరంగేంట్రంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు రాహుల్. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నవన్నీ వదంతులేనని, అవన్నీ ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ఎన్నికలలో పోటీ చేయట్లేదు. అవన్నీ ఫేక్ న్యూస్’ అని ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు.
Read Also : ISRO Scientists Salary : ఇస్రో శాస్త్రవేత్తల జీతాలెంత..?
‘అందరికీ నమస్కారం. గత కొన్నిరోజులుగా నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు, గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వస్తున్నవార్తలన్నీ ఫేక్ న్యూస్. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలతో పాటు నాయకులనూ గౌరవిస్తాను..’ అని స్పష్టం చేశాడు. ఈ క్లారిటీ తో పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది.