PV Ramesh Resigns : మేఘా కంపెనీకి రాజీనామా చేసిన పీవీ రమేష్
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రమేష్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారబోతుంది
- Author : Sudheer
Date : 12-09-2023 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
మేఘా ఇంజనీరింగ్ కంపెనీ (Megha Engineering Company)లో సలహాదారుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ (PV Ramesh)తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case) వ్యవహారంపై చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) నేపథ్యంలో రమేష్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారబోతుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందని పెట్టిన కేసులు.. తాను అప్రూవర్ అంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియాతో మాట్లాడనున్నారు. సోమవారం ఆయన ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన ఇప్పటికే సలహాదారుగా ఉన్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆయన తన ఉద్యోగానికి నిన్ననే రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కాంట్రాక్టుల నిర్వహణలో మేఘా కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారకూడదనే ఉద్దేశంతోనే పివి.రమేష్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. రమేష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినందున ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాల ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ లో రమేష్ ఎలాంటి విషయాలు బయటపెడతారో..? ఆ విషయాలతో చంద్రబాబు బయటకు వస్తారా..? ఆ తర్వాత జగన్ సర్కార్ ఏమిచేస్తుంది..? అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది.
Read Also : TDP in camera :చంద్రబాబు కుర్చీలో నేడు బాలయ్య! నాడు దేవేందర్ గౌడ్!!
మరోపక్క స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చేయడాన్ని PV Ramesh తప్పు పట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాల్సి కల్లం అజేయ కుమార్ రెడ్డి, ప్రేమచంద్రారెడ్డిలను కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
తన స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనే ప్రచారంపై పివి.రమేష్ అభ్యంతరం తెలిపారు. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదమని, అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని, స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తాను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని అనుమానం వ్యక్తం చేసారు.
https://x.com/iamkandula/status/1701490994917876010?s=20