Gachibowli Racket Busted : గచ్చిబౌలి ప్రాంతంలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం..
Gachibowli Racket Busted : దాడిలో 9 మంది విదేశీ మహిళలు, పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు
- By Sudheer Published Date - 12:04 PM, Wed - 29 January 25

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ హైటెక్ వ్యభిచారం రాకెట్(Hyderabad police bust international prostitution racket )ను గుట్టు రట్టు అయ్యింది. గౌలిదొడ్డి (Gowlidoddi ) ఏరియాలోని టీఎన్‌జీఓఎస్ కాలనీలో ఓ వ్యక్తి విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎవరికి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యభిచార దందా సాగిస్తూ, ఏజెంట్ల ద్వారా కస్టమర్లను ఎంచుకుని, ఫారిన్ అమ్మాయిలను ఉపయోగించుకుంటున్నాడు. ఇటీవల ఆ ప్రాంతానికి తరచూ విదేశీ యువతులు రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారు కొద్దిరోజుల పాటు నిఘా పెట్టి, ఏదో జరుగుతోందని అనుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్‌టీఎఫ్ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేశారు. దాడిలో 9 మంది విదేశీ మహిళలు, పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Honda Activa 2025 : ద్విచక్ర వాహన ప్రియుల కోసం కొత్త స్కూటీ.. 2025 హోండా యాక్టివా విడుదల
అరెస్టయిన మహిళలు కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో నిర్వాహకుడు ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ, ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా క్లయింట్లను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ అమ్మాయిలను అక్రమంగా దేశానికి రప్పించి ఈ వ్యభిచార దందా సాగిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల దాడి జరిగిందని తెలియగానే ప్రధాన నిర్వాహకుడు పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి కోసం మాదాపూర్ ఎస్ఓటీ ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ హైటెక్ వ్యభిచార గృహం వెనుక మరికొంత మంది ముఠా సభ్యులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారందరినీ గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.