Helicopter Crash: పూణేలో కుప్పకూలిన హైదరాబాద్ కు వస్తున్న హెలికాప్టర్
పూణె జిల్లా పౌడ్ గ్రామ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
- By Praveen Aluthuru Published Date - 04:28 PM, Sat - 24 August 24

Helicopter Crash: పూణెలో ఘోర విమాన ప్రమాదం వెలుగు చూసింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది.
పూణె జిల్లా పౌడ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రాణనష్టాన్ని అంచనా వేస్తున్నామని పుణె రూరల్ పోలీస్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు.
హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురిలో కెప్టెన్ గాయపడి ఆసుపత్రిలో చేరినట్లు పూణే రూరల్ పోలీస్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Prajwal Revanna : సెక్స్ కుంభకోణం.. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై 2,144 పేజీల ఛార్జిషీట్