power deaths: ప్రభుత్వం తప్పుకు కూలీల బలి
విద్యుత్ లైన్ ను సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, వర్షాలకు తెగిపడడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఫలితంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
- Author : CS Rao
Date : 02-11-2022 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
విద్యుత్ లైన్ ను సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, వర్షాలకు తెగిపడడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఫలితంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలు పంట కోత పనుల్లో ఉండగా, వారిపై విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో ఈ ఘటన జరిగింది.
వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగిందని దర్గాహొన్నూరు మాజీ సర్పంచ్ ముక్కన్న వెల్లడించారు. ఘటన స్థలం మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. తమ వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది.