AP : వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే – పోసాని
విజయవాడలో వంగవీటి రంగాను చంపింది చంద్రబాబే..ఎన్టీఆర్ ముఖం మీద చెప్పులు వేయించింది చంద్రబాబే
- By Sudheer Published Date - 08:57 PM, Tue - 29 August 23

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali). విజయవాడలో వంగవీటి రంగాను (Vangaveeti Ranga Murder) చంపింది చంద్రబాబే అని పోసాని ఆరోపించారు. కొద్దీ రోజులుగా పోసాని..చంద్రబాబు , లోకేష్ (Nara Lokesh) లపై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్ తనను హత్య చేసేందకు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై డీజీపీని కలిసి భద్రత కూడా కోరారు. తన చావుకు నారా కుటుంబమే కారణం అంటూ ఇదే మరణ వాంగ్మూలమని ఇటీవల వ్యాఖ్యానించారు. కంతేరులో లోకేశ్ భూమి కొన్నారని పోసాని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై లోకేశ్ పరువు నష్టం దావా వేశారు. దీంతో లోకేశ్, పోసాని మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారంటూ పోసాని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఇంకా మీడియా లో చక్కర్లు కొడుతుండగానే..మంగళవారం మరోసారి చంద్రబాబు , లోకేష్ లపై పలు విమర్శలు , ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.
Read Also : Rajinikanth : కండక్టర్ గా పనిచేసిన బస్ డిపో ను సందర్శించిన రజనీకాంత్..
ఎన్టీఆర్ (NTR) ముఖం మీదే చంద్రబాబు చెప్పులు వేయించారని.. అలాంటి ఎన్టీఆర్‌ను చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గుచేటని పోసాని అన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పురంధేశ్వరి (Daggubati Purandeswari), ఎన్టీఆర్ కొడుకులు తండ్రిని అవమానిస్తే ప్రశ్నించరా? అని నిలదీశారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు అని, ఆయన్ని అవమానించిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో వంగవీటి రంగాను చంపింది చంద్రబాబే అని పోసాని ఆరోపించారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అవినీతిపరుడని అన్నారు. తనపై నరేంద్ర చేసిన ఆరోపణపై బహిరంగ చర్చకు సవాల్ చేస్తున్నానని అన్నారు. గుడిలో ప్రమాణం చేయడానికి కూడా నరేంద్ర సిద్ధమేనా అని ప్రశ్నించారు. లోకేశ్ అంత నీచంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడంలేదని పోసాని ఆరోపించారు. చంద్రబాబు అలవాట్లన్నీ నారా లోకేశ్‌కు వచ్చాయన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు సంక్షేమపథకాలు అందిస్తుంటే చంద్రబాబు, లోకేశ్ బూతులు మాట్లాడుతున్నారన్నారు. పోలీసులను రౌడీలతో కొట్టించిన చంద్రబాబు… ఇప్పుడు సిగ్గులేకుండా పోలీసు సెక్యూరిటీతో తిరుగుతున్నారని మండిపడ్డారు.