Minister Ponnam: ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకులాలు మంచి ఫలితాలు సాధించడం హర్షణీయం:
- By Balu J Published Date - 09:37 PM, Sat - 18 May 24

Minister Ponnam: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి 369వ ర్యాంక్ సాధించింది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు ర్యాంక్ లు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 145 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో 114 మంది అర్ఙత సాధించారు. స్ఫూర్తి 369 ర్యాంక్ సాధించి బీసీ గురుకుల బాలికల ప్రతిభను నిరూపించింది. ఐదువేల లోపు ర్యాంక్ లు 12 మంది, పదివేల లోపు ర్యాంక్ లు 29 మంది బాలికలు సాధించారు. బి. నాగలక్ష్మి (2021), ఎ. శిరిష ( 2547), బి.అనుష(3181), దివ్య(3224), బి. హర్షిత(3228), జి. మోనిక(3685), ఎ. ప్రవల్లిక(4170) ఎ. రమ్య(4480) సాత్విక(4732), రిషిత(4786), నిఖిత(4861) ఐదువేల లోపు ర్యాంక్ లు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 25 మంది బాలురు పరీక్ష రాయగా వారిలో నలుగురు బాలురు జి. క్రాంతి కుమార్ (3735) ర్యాంక్ సాధించారు’’ అని అన్నారు.
‘‘ఇంజనీరింగ్ విభాగంలో 276 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో ఇద్దరు పదివేల లోపు ర్యాంక్ సాధించారు. 191 మంది అర్హత సాధించారు. 135 మంది బాలురు పరీక్ష రాయగా వారిలో 5 మంది బాలురు పదివేల లోపు ర్యాంక్ లు సాధించారు. 107 మంది క్వాలిఫై అయ్యారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు మరిన్ని ర్యాంక్ లు సాధించేలా ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించాలి, విద్యార్థులు మరింత కష్టపడి మంచి ర్యాంక్ లు సాధించాలి.ఇప్పటికే గ్రీన్ చానెల్ ద్వారా మెస్ చార్జీలు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుండి.బీసీ గురుకుల పాఠశాలలకు ,హాస్టల్ లకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఇప్పటికే క్యాబినెట్ అందించింది,బీసీ గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వారు మరిన్ని ర్యాంకులు సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని మంత్రి అన్నారు.